పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-1 ముఖారి సంపుటం: 11-427

పల్లవి: వెన్నలు సెలవిఁ గారే విఠ్ఠలేశా
         నన్ను చచి నవ్వేవు నాలి విఠ్ఠలేశా

చ. 1: బాలులతో నాడి యాడి బడిలితివి రావయ్య
       వేలెటికురుల ముద్దువిఠ్ఠలేశా
       కాళింగుఁ దొక్కితి వట కటకట వుద్దండాలు
      వోలిఁ జేయ దొరకొంటి వోవిఠ్ఠలేశా

చ. 2: దూడలవెంటఁ దిరిగి దూళి మేన నంటె నిదే
       వేడుక యంతో నీకు విఠ్ఠలేశా
       యేడకొండో వొకవేల నెత్తితివి నీ వట
       వోడక యింత సేతురా వోవిఠ్ఠలేశా

చ. 3: గొల్లెతల నంటి యంటి గొల్లు మేన నిండె నిదే
       వెల్లవి రాయఁ బనులు విఠ్ఠలేశా
       యిల్లిదె పండరంగిని యిటు శ్రీవెంకటాద్రిని
       వుల్ల మలరు నిలిచి తోవిఠ్ఠలేశా