పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-6 రామక్రియ సంపుటం: 11-426

పల్లవి: నీకే తెలుసు నయ్య నీతగవూ
         యీక డాకడివారలు యే మందురో కాని

చ. 1: అంచెలఁ బెట్టెను చూపు లంగన నీరాకకు
       యించుకంత నీజాగు లెరఁగ రాదూ
       మంచివాఁడ వంటానె మమ్ము నంపె నీకడకు
       యెంచి యిటమీఁదిపను లె ట్టుండునో కాని

చ. 2: పడఁతి మొక్కులు నీకు పౌఁజు లెదురుగా నంపె
       అడరి నీరాజస మింతౌ తెరఁగదూ
       అడియాలము చెప్పంపె నది యెం తైనాఁ గలదు
       యెడసి నీ వుండినందుకు కే మనునో కాని

చ. 3: కాంత కుచములు నీకు కానికెనా మీఁ దెత్తె
       పంతము నీవు చెల్లించేబా గెరఁగదూ
       అంతలో శ్రీవెంకటేశ ఆదరించి కూడితిని
       యింతటి నీ మేలు దక్కె నిఁక నెంతో కాని