పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-5 మంగళకౌశిక సంపుటం: 11-425

పల్లవి: ఇసుమంత పని కైన యియ్యకొందును నీ
         వస మైనదాన నీకు వంక లాడ వలెనా

చ. 1: మన్నించి నీవు నాతో మాట లాడితిని గాక
       సన్న సేసి నిలచుటే చాలదా నాకూ
       నన్నుఁ జూచి మరిఁ గొంత నవ్వు నవ్వితిని గాక
       వున్నట్టె నావొద్ద నీవు వుండితేనె చాలదా

చ. 2: కరుణించి నీవు నాకాయ మంటితివి గాక
       సరిపేరఁ బిలిచిన చాలదా నాకు
       మరిగించుకో లేక మంతన మాడేవు గాక
       గరిమె నీసొమ్మ నని కైకొంటే చాలదా

చ. 3: ఆదరించి కాఁగిట నీ వలముకొంటివి గాక
        సాద నంటా మెచ్చి తిదె చాలదా నాకు
        సేదదేరఁ గూడితివి శ్రీవెంకటేశ నీవు
        పాదము చాఁచి నన్నుఁ బైకొనుటే చాలదా