పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-3 పాడి సంపుటం: 11-423

పల్లవి: నే నొకటి నేయఁగాను నీ వొకటి సేసేవు
         కోనచెన్న రాయఁడ నీగుణ మింక మానవు

చ. 1: పక్కన నే తోడ పకపక నగఁగాను
       తెక్కుల నీ వైతే నేల తిట్ట వచ్చేవూ
       మొక్కలము విడిచి నే ముచ్చట లాడుకోఁగాను
       వెక్కసపువెంగె మని వేరె తలఁచేవూ

చ. 2: తనివోక నే నిన్ను తప్ప కిట్టె చూడఁగాను
       తనవు చూచుక నీకే తల వంచేవు
       అనుమానము లే దని ఆన నీపైఁ బెట్టఁగాను
       పెనచి నీ వామాఁట పేరడిఁ బెట్టేవూ

చ. 3: కందువ లంటుచు నిన్ను కాఁగిట నించఁగాను
       పొందుల నుప్పు వేసి పొత్తు గూడేవూ
       అందపు శ్రీవెంకటేశ అట్టె కొనచెన్నఁడ వై
       ముందు వెనకాఁ గూడి మోహము చల్లేవూ