పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-2 కన్నడగౌళ సంపుటం: 11-422

పల్లవి: ఇంక నేల ఆసుద్దులు యిన్నియు నిందే కంటిమి
         అంకెల నీ విన్నాళ్లు అంతేసి నేరుతువా

చ. 1: నవ్వెటినిన్నుఁ జూచి నమ్మఁగలదానఁ గాక
       యెవ్వరికపటా లెట్టో యెఱఁగుదునా
       మవ్వపు నీమేన నేఁడు మచ్చములు గంటిఁ గాక
       నెవ్వగ నపనమ్మిక నీపై తొల్లి కంటినా

చ. 2: నీనయగారములకు నేనే మెచ్చుకొందుఁ గాక
       యే నెపానకుఁ జేయుట యెరుఁగుదునా
       కానీలే నీకపటాలు కానఁబడెఁ గాక నేఁడు
       నానాఁడె నీ గుణము నా కింత దెలుసునా

చ. 3:గక్కన నీవు గూడఁగ కాని మ్మని యందుఁ గాక
      యెక్కడనుండి వచ్చుట యెరుఁగుదునా
      యిక్కువ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
      నిక్కి నేఁడు సేసే మేలు నిన్న నెరుఁగుదునా