పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0371-1 లలిత సంపుటం: 11-421

పల్లవి: ఇందుకే వెర గయ్యీ మాకు
         అందపురమణుఁడు అతఁడే యెఱుగు

చ. 1: చెలిచిగురుమోవి చిత్తజునడిదము
       వొలకుఁదేనె లె ట్లులికనో
       కులుకుఁజూపు పతిగుండెబెదరు లవి
       కలికివెన్నె లెటు గాసీవో

చ. 2: కాంతకుచంబులు గట్టికొండ లవి
       దొంతివల పెట్లఁ దొరిగోనో
       పంతపునడు మది బట్టబయలు గిలి
       గింత నెట్లఁ గరఁగీనో తానూ

చ. 3: తరుణిదేహ మింతయు బంగారమె
        సొరిదిరతుల నెట్టు చొక్కెనో
        యిరవుగ శ్రీవెంకటేశ్వరుఁడు గూడెను
        అరిది విభవము లెట్లబ్బెనో