పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-6 ముఖారి సంపుటం: 11-420

పల్లవి: ననుఁబోటిగాఁ గా నాతో నవ్వేఁ గాక
         గునినే యాఁట దైతే గుంపించ కుండునా

చ. 1: తక్కక నేను నిన్ను తప్పు లెంచఁ జాలఁ గాక
       నిక్కపు నీవొళ్లితప్పు నీ వెఱఁగనా
       చెక్కు నొక్కి చెలు లెల్లాఁ జెప్పఁగానె వింటిఁ గాక
       వెక్కసపుటాఁట దైతే విడనాడ కుండునా

చ. 2: కావరించి నిన్నుఁ దారుకాణఁ బెట్టఁ జాలఁ గాక
       నీ వాడినమాఁటలు నీ వెఱఁగవా
       మోవ నాడి యిందరూను మొక్కఁగానె వింటిఁ గాక
       చేవ దేరి నాఁట దైతే చిమ్మి రేఁచ కుండునా

చ. 3: కలసినమీఁద నీతోఁ గపటాలు నేరఁగాక
       నిలువు నీకుచ్చితాలు నీ వెరఁగవా
       చెలఁగి కూడితి విట్టె శ్రీవెంకటేశ నన్ను
       అలిగినయాఁట దైతే నలయించ కుండునా