పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-5 లలిత సంపుటం: 11-419

పల్లవి: ఇందుకే వెరగయ్యీ నన్నెంచుకొంటేనూ
         పందను దైవాన కెట్టు బాఁ తైతినో నేనూ

చ. 1: యెన్కికకూ మాని సంటా నెట్టు వుట్టించె దైవము
       పన్ని యాఁడువా రే మన్నఁ బంత మిత్తును
       వున్నమచందురునకు పువ్వులమొనలకును
       వెన్నెలబాయిటికిని వెరతు నేనూ

చ. 2: యెందుకుఁ గొ రౌదు నంటా యెట్టు వెంచె దైవము
       ముందె ముట్టునెత్తురుముద్దను నేనూ
       అంది చనుగొండలలో నధరామృతములలో
       అందందె పొట్టువొర లైయలతు నేనూ

చ. 3: యెక్కడిదొర న న న్నేలె శ్రీవెంకటేశుఁడు
       మక్కువఁ బయ్యదకొంగమాఁటువాఁడనూ
       చక్కెరమాఁటలకును జంకెనబొమ్మలకును
       పక్కన లో నై యట్టె భ్రమతు నేనూ