పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-4 లలిత సంపుటం: 11-418

పల్లవి: మానవు జగడము మాతోను
         నేనీకిం తేసి నేరుపనా

చ. 1: రపమున న న్నిటు రమ్మని పిలువఁగ
       అపుడే నే నోప నననా
       ఉపమల దూరేవు వూరకే నను నిటు
       కపటం బిపుడే కైకొంటినా

చ. 2: చెనకుచు నాపైయి చేతులు చాఁచఁగ
       కొనచూపుల నినుఁ గోపించగా
       తనియక నీవే తగిలేవు గాక
       యెనసి యాస నీ కిచ్చితివా

చ. 3: కలయుచు నీవే కాఁగిట నించఁగ
       వలపు నీవు మఱవకు మనవా
       బలిమి శ్రీవెంకటపతి ననుఁ గూడితి
       వలసి యెదురుమా టాడితినా