పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-3 శంకరాభరణం సంపుటం: 11-417

పల్లవి: ఎవ్వరితో గొడ వేల యింకా నీకు
         రవ్వగా నీయింటికి రమ్మనేవు నీవూ

చ. 1: యీయింతిపయి మన్నన నీ కఁటిదో వొక్కమాఁటలో
       సేయరానిపను లైన సేతువు నీవు
       మాయ సేసి యాపె నీతో మచ్చిక చల్లితేఁ జాలు
       పాయ లేక నిలువున భ్రమతువు నీవూ

చ. 2: యెవ్వ రైనా నాపెను నేఁ డిటు పేరుకొంటేఁ జాలు
       అవ్వల మూపులు మూఁడు అవుదువు నీవు
       నవ్వులకు నాపెపయి నానలు వెట్టితేఁ జాలు
       నివ్వెరగుపడి అట్టె నిలుతువు నీవూ

చ. 3: యెంతదడ వాపె నీయెదుట నుండితేఁ జాలు
       రంతులఁ గిందు మీఁదు నరయవు నీవూ
       కాంతతో శ్రీవెంకటేశ కడపలోఁ దే రెక్కి
       యింత నన్నుఁ గూడి వీదు లేఁగితివి నీవూ