పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-6 దేసాళం సంపుటం: 11-414

పల్లవి: నీకుఁ బోదు నాకుఁ బోదు నీ వెట్టు సేసినాఁ జేయి
         సాకిరివంటిది నాజవ్వన మిందుకును

చ. 1: జిగురువంటిది నాచిత్త మిది నీమీఁదఁ
       దగిలి విడువరు నీ తగురూపు
       తగరువంటిది నాతమకము మీఁద మీఁద
       నతడు నేయు నీయాయాలు దాఁకీని

చ. 2: బచ్చనవంటిది నాపలుకు నీయడకును
       అచ్చమై చూడఁ జూడఁగ నంద మై యుండు
       నిచ్చనలవంటివి నానిండుఁ గోరికలు నీకు
       హెచ్చినవలపు తల కెక్కఁ జేసేయెందుకు

చ. 3: గాలమువంటిది నాకాఁగిటికూటమి నీకు
       తూలి మరి యెందుకునుఁ దొలఁగ రాదు
       తాలమువంటిది నాతగులమి నీమీఁద
       మేలిమి శ్రీవెంకటేశ మీఁదఁ గిందఁ బాయదూ