పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-5 శ్రీరాగం సంపుటం: 11-413

పల్లవి: ఇంత సేసినట్టి తన్ను నేమి సేసేమే
         చింతతోడ నాచెక్కు చేతిమీఁది కెక్కెనూ

చ. 1: దవ్వుల నుండేతనకు దండము వెట్టితి మిదె
       యివ్వల నింకా మాతో నేమి నవ్వీనే
       రవ్వ లాయ మావలపురాజ్యములోన నెల్ల
       పువ్వుటమ్ములమనసు పుర వురఁ బొక్కెను

చ. 2: పట్టక తొల్లె తనకుఁ బంత మిచ్చితి మిదె
       యిట్టె మాదిక్కు తా నేమి చూచీనే
       వెట్టివిన్నపము లాయ వేగుదాఁకా మాకతలు
       జట్టిగా మావిరహము చల్లువెద లాయను

చ. 3: చేరి తాఁ బైకొనఁ గానె చేతికి లో నైతి మిదె
       యీరీతి నాయడకు తా నెంత సేసీనే
       కూరిమి నిట్టె నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు
       తీరుకు వచ్చి పనులు తేటతెల్ల మాయను