పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-4 రామక్రియ సంపుటం: 11-412

పల్లవి: ఇంకా నేల తడవే వేరా నీవు
         సంకె దేరె నాకు నీ చలమూఁ జెల్లెనూ

చ. 1: మాట నీతో నాడితిని మనసూఁ దెలిసితిని
       యేఁటికి నన్నుఁ బిలిచే వేరా నీవు
       యీటుతోఁ బెండ్లాడితివి యిట్టె సేస వెట్టితివి
       వాఁట మాయ వలపులు వద్ద చే నుందానను

చ. 2: చేత నీకు మొక్కితిని చేరి నీతో నవ్వితిని
       యీతల నన్నొరసేవు యేరా నీవు
       నీ తగులు చూపితివి నెగు లెల్లా బాపితిని
       యేతు నీకు గన మాయ నియ్యకొంటి నందుకు

చ. 3: కన్నుల నిన్నుఁ జూచితి కాఁగిటిలో నున్నదాన
       యేన్నేసి ప్రియాలు చెప్పే వేరా నీవు
       నన్ను మన్నింతిని విట్టె నంటున శ్రీవెంకటేశ
       చిన్నపులకలు నిండి సెలవు నా కాయనూ