పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-3 రామక్రియ సంపుటం: 11-411

పల్లవి: చేసిన ట్టెల్లా నీకే చెల్లుఁ గాకా
         ఆ సుద్దులు దడవి నిన్నంత సేయ వచ్చునా

చ. 1: నెమ్మొగము వాడె నంటా నిండుఁజెమ టేడ దంటా
       దిమ్మరిమాఁటల నిన్నుఁ దిట్ట వచ్చునా
       అమ్మరో పానుపుమీఁద నాకె నీవు నున్నా రంటా
       నిమ్మపంటఁ గొని నేము నిన్ను వేయ వచ్చునా

చ. 2: యేతల చూచే వంటా యెంగిలిత మ్మేడ దంటా
       చేత వంటి నిన్నే మైనాఁ జేయ వచ్చునా
       భీతి లేక ఆపె వెంటఁ బెట్టుక వచ్చితి వంటా
       నీతి దప్పి చిన్నఁ బో నిన్నుఁ జేయ వచ్చునా

చ. 3: ఆకెచే మొక్కించే వంటా అట్టె సిగ్గు వడ వంటా
        కాకు సేసి నిన్ను గంప గమ్మ వచ్చునా
        యీకడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితిని
        పైకొని యింకా నిన్నుఁ బచ్చి సేయ వచ్చునా