పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-2 దేసాళం సంపుటం: 11-410

పల్లవి: ఎట్టు నేసినా నీచిత్త మింతే కాక
         వట్టి జాలి నే నేల వాదు లడిచేను

చ. 1: చింత లేమిటికి నీవు చిత్తములో నుండఁగాను
       పంత మేఁటికి నీవు చే పట్టి వుండఁగా
       వింతదాననా నన్ను వేఁడుకొనే విప్పు డిట్టే
       యెంత లేదు నీతో నే నేల యలిగేను

చ. 2: కోప మేఁటికి నీవు కొంగు వట్టు కుండఁ గాను
        కైపు లేమిటికి నీవు గలి గుండఁగా
       మాపుదాఁకానె నీకు మన్ననదానఁ గాన
       యీపాటి కీపాటి యేల యలిగేను

చ. 3: వేసా లేమిటికి నీవు వేమారు నవ్వఁగాను
       బాస లేమిటికి నన్నుఁ బచ్చినేయఁగా
       ఆసగా శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
       యీ సుద్దులకే నీతో నేల యలిగేను