పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0369-1 శంకరాభరణం సంపుటం: 11-409

పల్లవి: అయ్యో యిన్నాళ్లు నీవే నే నని వుంటివి
         నెయ్యపు నీ కపటాలు నే నెరఁగ నయ్యా

చ. 1: యీడు గానిచెలి నన్ను నే మేమో ఆడఁగాను
       వేడుక నోరాఁ గన్నుల వినేవు నీవు
       తాడుపడి నే నందుకు తరిఁ జిన్నఁ బో యుండఁగాఁ
       గూడెనా నీ కే మైనాఁ గోరి కట్టుకోవయ్యా

చ. 2: పుక్కటసతులు నాతో పురుఁడుకు రాఁగాను
       దక్కెనా నీ పంత మదె తగఁ జూచేవు
       పక్కన నే నిందుకుఁ గా పై పై నిన్ను దూరఁగాను
       అక్కర దీరెనా నీకు నైతే నీచిత్తమయ్యా

చ. 3: నడుమంత్రాన నొకతె నాయెదుట మురియఁగా
       యెడయక సమ్మతాన నేల నవ్వేవు
       బడినె శ్రీవెంకటేశ పాయక నేఁ గూడఁగాను
       యెడపులవారిపోందు లేమి బాఁతి నీ కయ్యా