పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0368-3 శంకరాభరణం సంపుటం: 11-405

పల్లవి: మిము దూర నోపను మించతనిఁ బాయ లేను
         తమకము దైన్యముఁ దడఁబడెనూ

చ. 1: ఆల విభునియెలుఁగు ఆలించెద నిదె
       పలుకకురే అటు పలుమారు
       యెలమి నాతనికి నెదు రేఁగెద నిదె
       పిలువకురే ననుఁ బెనఁగుచును

చ. 2: వడి నతని నగరివంక చూచెదను
       యెడ నడ్డము రా కిటు దలరే
       తొడ రతనిసతులతో మాఁట లాడెద
       చిడుముడిఁ బరాకు సేయకురే

చ. 3: శ్రీవెంకటపతికిఁ జేతుల మొక్కెద
       చేపల బుద్దులు చెప్పకురే
       కావించి నన్నతుఁడు కాఁగిటఁ గూడెను
       భావించి ననుఁ బై పై నవ్వకురే