పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-5 భైరవి సంపుటం: 11-401

పల్లవి: ఎప్పుడు నీసుద్దులు నే మెరిఁగినవే
         కప్పురము గోవయ్య తల లెల్ల మాని

చ. 1: నొస లెల్లఁ జెమరించి నున్నని చెక్కుల జారె
       కిసరి యెవ్వతె యలిగెనో నీతోను
       యిసుమంత వడె కాని యింతి నిన్నుఁ బాయ లేదు
       విసరేము రావయ్య వేసాలు మాని

చ. 2: సరు లెల్ల జిక్కువడి చల్లువెద లైన వివే
       సిరుల నిన్నెం తాపె చేయి ముట్టెనో
       సరస మింతే కాని చలము నీతోఁ గాదు
       సరిసేసుకోవయ్య చలములు మాని

చ. 3: నిట్టూరుపులు రేఁగె నిద్దుర కన్నులఁ దేరె
       అట్టె యెవ్వతెరతి నలసితివో
       నెట్టన శ్రీవెంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
       పట్టపలమేల్‌‌మంగను పంత మెల్ల మాని