పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-4 సామంతం సంపుటం: 11-400

పల్లవి: ఇదివో తెలుసుకోరా యింకా నీవు
         మదనపరవశాన మర పాయఁ గాని

చ. 1: వాలుకరెప్పలు నాపై వంచి వంచి చూచేవు
       ఆలించి న న్నెరిఁగిన ట్టయ్యీనో నీకు
       మేల మాడి చూడు తొల్లి మేనవారమే మనము
       సోలిఁ బెక్కుసతులలో చూచి మర పాయను

చ. 2: వీరి వారి యేకాంతాన విచారించి చూచేవు
       కారన మే మైన నాతోఁ గద్దో నీకు
       చేరి దగ్గరిన తొల్లి చెందిచుట్టాలమే
       తారుకాణ లేక సందడి మర పాయనూ

చ. 3: పెనఁగి పెనఁగి నన్ను పే రడిగి చూచేవు
       కనుచూపులగురుతు కంటివో నీవు
       యెన లే కలమేల్‌‌మంగను శ్రీవెంకటేశ్వర
       మనరతులనుఁ జొక్కి మర పాయఁ గాని