పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-3 గుండక్రియ సంపుటం: 11-399

పల్లవి: మమ్ము నేల తడవేరు మాటిమాఁటికి
         వొమ్మదు మాకు వలపు లో చెలులాల

చ. 1: మన నెల్లా నివ్వెరగు మాటలు నాకు వేసట
       యెన లేనికత లెల్లా నేమి చెప్పేరే
       విన నోప మారుమాట వివరించా నే నోప
       అనుమాన మెల్లఁ దీర నాతని నడుగరే

చ. 2: కాయముపైఁ జెమటలు కన్నులపై వసినాడు
       చేయి వట్టాతని నేల చేరఁ దీసేరే
       సేయ లేను వినయాలు చేచేతఁ గొసర లేను
       మాయకాఁ డాతని మీరె మనసు దెలియరే

చ. 3: నిమిష మొక్కటి యేఁడు నిండుఁబాయము తరవు
       భ్రమయించి యాల వొడఁబరచేరే
       సమరతి శ్రీవెంకటేశ్వరుఁ డిట్టె నన్ను గూడె
       తమితో నాతని మీరు తప్పక నవ్వించరే