పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-2 దేసాక్షి సంపుటం: 11-398

పల్లవి: నేసినట్టు నేయవయ్య చిత్తము వచ్చినయట్టు
         బాస దుప్పేమగవానిఁ బట్ట వస వవునా

చ. 1: నేమాన నేపుణ్య మైన నీవో కట్టుకొందు గాక
       యే మనిన నీ మాట కెదు రాడేమా
       మోము వంచు కాఁడువారు మూలనుండుదురుగాక
       గామిడైన మగవానిఁ గక్కసించఁ జెల్లునా

చ. 2: కిమ్ములవా రాడెటికీరితి నీదే కాక
       యెమ్మె నెవ్వతెఁ దెచ్చినా నెగ్గు లెంచేమా
       వుమ్మడిమానాపతులు వోరుచుకుందురు గాక
       దిమ్మరి మగవారితో దీకొనఁగఁ జెల్లునా

చ. 3: పాపపుణ్యములలోని ఫలము నీదే కాక
       యేపని సేసిన నీతో నీసడించేమా
       చేపట్టి కూడితి నన్ను చేతిలోనిదాన నంటా
       పై ఫై శ్రీవెంకటేశ బలుము చెల్లునా