పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-1 దేవగాంధారి సంపుటం: 11-397

పల్లవి: మేరకు మేరే కాక మీర వచ్చునా
         ఆరీతి నారడి య్రైతే నంద మవునా మాటలు

చ. 1: మొగమోట గలచోట ముంచి వా దడువ నేల
       నగితోనె చాలదా నయముగాను
       తెగనాడేమాట లెల్ల తెలుసుకోనీ నాతఁడె
       జగడ మయినమీఁద చక్క నవునా పనులు

చ. 2: యెగ్గు పట్ట రానిచోట యెక్కువ తక్కువ లెల్ల
       సిగ్గు వడుటే చాలదా సిరసు వంచి
       దగ్గరి కాఁ గలపని తనుఁ దానె తోఁచీని
       కగ్గినందుమీఁద పతిఁ గైకొలుప వసమా

చ. 3: మన నెరిఁగినచోట మరి యెడమాట లేల
       పెనఁగుటే చాలదా ప్రియముతోడ
       యెనసె శ్రీవెంటకేశుఁ డింతలోఁ దానె నిన్ను
       చన‌ మిచ్చినందుమీఁదఁ జలములు గలవా