పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0366-6 కాంబోది సంపుటం: 11-396

పల్లవి: ఇచ్చకమే నడచేటియిల్లాల నేను
         పచ్చిసేఁత లివి మాకు పాడిగా దయ్యా

చ. 1: పక్కనఁ దిట్టఁగ నోప పై పై వేఁడుకొన నోప
       వొక్కరీతి గుట్టుతోడ నుండే నేను
       అక్కడివారెనీకు నన్నిటికి నేరుతురు
       చిక్కించుక యిత వైతే నేయించుకో వయ్యా

చ. 2: అలిగి పొమ్మన నోప అప్పటి మొక్కఁగ నోప
       నిలిచి రాజసముతో డే నుండేను
       వెలయాండ్లే నీకు వినోదాలు నడుపేరు
       చెలఁగి నీ కిత వైతే సేయించుకో వయ్యా

చ. 3: బొమ్మల జంకించ నోప పొరిఁ జెక్కు నొక్క నోప
       యెమ్మె నీరతులఁ జొక్కి యిట్టుండే నేనూ
       నెమ్మది‌ శ్రీవెంకటేశ నీవు గూడితివిగ నన్ను
       చిమ్మల నీ సేవ నాచేఁ జేయించుకోవయ్యా