పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0366-5 ఆహిరి సంపుటం: 11-395

పల్లవి: నీవు చేసినచేఁతకు నెలఁత యేమీ ననక
         కావికన్నులకొనల కలకల నవ్వెను

చ. 1: మక్కువ నిన్ను దూరఁగ మనసు నొచ్చనో యని
       వుక్కున జంకించఁగాను వొచ్చెమో యని
       నిక్కి నిన్నుఁ జూడఁగాను నేరమి మోఁచునో యని
       చెక్కు నొక్కి యింతి నిన్నుఁ జేరి నవ్వెనూ

చ. 2: యేల రావైతి వనఁగ నిట్టె చిన్నఁ బోదు వని
       వేళ గాచు కుండఁగాను వెంగెమో యని
       తాలిమితో నూరకున్నఁ దల వంచుకొందు వని
       వేలు ముక్కుపై మోఁవి వికవిక నవ్వెనూ

చ. 3: చేయి వట్టి తియ్యఁగాను సిగ్గు వడుదువో యని
        రాయడింపురతులకు రాఁ పయ్యే వని
        యీయెడ శ్రీవెంకటేశ యిట్టె నిన్నంగన గూడి
        పాయపుమదము తోడ పకపక నవ్వెను