పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0366-4 శుద్దవసంతం సంపుటం: 11-394

పల్లవి: ఏల మమ్ము నెగ్గు లెంచే వే మంటి నిన్ను
         తాలిముల కెల్ల గురి తనమనవే

చ. 2: మోహము గలవారికి ముంగోపపుతి ట్లెల్ల
       దేహనకు చల్ల నైనదీవెన లౌను
       యీహల మనసు రాక యిత వెంత సేసినాను
       వూహించి చూచినను వొరటు లై తోఁచుము

చ. 2: అచ్చివచ్చినచోటికి ఆయాలు దాఁకించుకొన్న
       మచ్చికఁ గళలు రేఁగేమర్మము లౌను
       మచ్చర మైనచోట మరి పాదా లొత్తినాను
       కచ్చు పెట్టి యవే కామాకారము లై తోఁచును

చ. 3: అనుమాన మైనందుకు అన్నియానలు వెట్టిన
       పనికి వచ్చునో రాదో భావించ రాదు
       ఘనుఁడ శ్రీవెంకటేశ కైకొని కూడితి నిన్ను
       వెనకటిదయ నాపై విడువకు వయ్యా