పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0366-3 ధన్నాశి సంపుటం: 11-393

పల్లవి: మందరిదోసము వాయ మొక్కితి మయ్య
         చెంది నీపనికి నోఁచితఁగా నేను

చ. 1: అంగనలతో వాదు లడిచినకోవ మెల్ల
       ముంగిట నుండిన నీపై ముంచితి నేను
       చెంగట నూరకె నీ చిత్త మింత నొప్పించితి
       సంగతిగా నెంత పాపజాతినో నేను

చ. 2: యెగసక్కెపుసవతు లే మేమో నవ్వఁగఁ జూచి
       మొగము చూడక నామోము వంచితి
       తగ వెఱఁగక నేనే తమకించితి నీ మీఁద
       జిగి నన్నింత కట్టిణిఁ జేసెఁ గా దైవమూ

చ. 3: పడఁతులతోడ నేను పంత మాడినదాన నై
       చిడుముడిఁ గూడి వచ్చి సేసితి నిన్నూ
       కడఁగి శ్రీవెంకటేశ గబ్బి నైతిని రతుల
       వెడఁగుఁజలాల నెంత వెఱ్ఱినో నేనూ