పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0366-2 నారణి సంపుటం: 11-392

పల్లవి: ఎగసక్కె మాడితేనె యెంత సేసేవు
         మగువతోనె నేఁడు మంకు లేల నేకును

చ. 1: పలుమారుఁ బిలిపించీ పదవయ్య చెలి నిన్ను
       అలిగి వచ్చితి వంటా అప్పటినుండి
       చల మెంత గలిగిన సతి నీవు గూడుకుంటె
       తెలుసుకొందురు గాక తెగు వేల యీడను

చ. 2: వాకిట నిలుచున్నది వచ్చినదాఁకా నీవు
       రాక తా నారగించదు రమణి నేఁడు
       యేకతాన నాపెతోనె యే మన్నా నందువు గాని
       వాకునిష్ణూరము లేల వద్దు వద్దు యీడను

చ. 3: కొంగు వట్టి తీసీ నిన్ను కొమ్మ దానె యిందు వచ్చి
        వుంగిటిఁ జిన్నఁబోయి వున్నాఁడ వంటా
        అంగవించి శ్రీవెంకటాధిప కూడితి విట్టె
        వెంగలియాన లెల్ల విడవయ్య యిఁకను