పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0365-6 వరాళి సంపుటం: 11-390

పల్లవి: ఏమి సేతు మొగమోట మిదివో నాకు
         దీమసానఁ దిట్ట లేను దీవించ లేనూ

చ. 1: తోయ రాదు నీ మాఁట దొరవు నీ వాన తీఁగా
       సేయ రా దటంటే నీవు చెప్పిన ట్టెల్ల
       రాయడిసతుల మచ్చరము నాలో మాన లేను
       వే యైనా నీ వారి పొందు విడిపించ లేనూ

చ. 2: తెగ రాదు నీమీఁద తేరి నన్నుఁ బొగడఁగ
       నగ కుండ రాదు నీవు నవ్వించఁగ
       వొగి నీ వెం దైనఁ బోతే వోరుచు కుండఁగ లేను
       మగఁడవు నీ గుణాలు మట్టుపెట్ట లేను

చ. 3: పట్ట రాదు పాయ మిది ఫైకొని నీవు గూడఁగా
       గుట్టు నేయ రాదు నీవు కొంగు వట్టఁగా
       చుట్టాలఁ జేసితివి నీ సుదతుల నెల్లాఁ దెచ్చి
       యిట్టె శ్రీవెంకటేశ యింక బాయ లేనూ