పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0365-5 సామంతం సంపుటం: 11-389

పల్లవి: అన్నియుఁ గావలసిన ట్టయ్యీఁ గాని
         యెన్నికగా మమ్ము నంపు యేల నవ్వే విఁకను

చ. 1: ఆనుక నీ వాడినట్టే ఆపెతో నే విన్నవించే
       వీనుల నీ మాట లెల్ల వింటిఁగా నేను
       కానుకగాఁ బట్టె మయ్య కాంతకు నీ సరితెలు
       యీ నిజాలె చెల్లించుకో యేల నవ్వే విఁకను

చ. 2: అక్కడనే పనులు అందాలుగాఁ జేసి వచ్చే
       గక్కన నీ చేఁత లెల్లఁ గంటిఁ గా నేను
       పెక్కు నీవినయములు బిందెల నించే నాపెకు
       యిక్కడనే వుండవయ్య యేల నవ్వే విఁకను

చ. 3: తీపులు గా నీరాక తేట తెల్లములు సేసే
       నాపెకు నీకు లో నైతిఁ గా నేను
      యేపున శ్రీవెంకటేశ యిద్దరిఁ గూడించితిని
      యేప నైనా నాన తీ నీ వేల నవ్వే విఁకను