పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0365-3 బౌళి సంపుటం: 11-387

పల్లవి: ఏరా నావద్ద నుండే యిది దగునా
         ఆరీతిఁ గనీఁ గానమి నది గొంత గాక

చ. 1: కాఁకలు నేయుచు నాపె కన్ను లెదిటికి వచ్చి
       సోఁక నిన్ను నవ్వితేనె చొక్కి పడేవు
       మూఁకలో నుండి అప్పటి ముసుఁగు వెట్టుక కొమ
       రాఁకల నెలయించఁగ నట్టె చూచేవు

చ. 2: మటమాయముల నాపె మాట దీసి నీతోడ
       సటులు రెం డాడితేనె చన విచ్చేవు
       తటుకున నప్పటిని దగ్గరికివచ్చి యాసె
       యెటు నేయు మనినాను యియ్యకొనే విపుడు

చ. 3: సిగ్గుపడ కాపె నిన్ను చేచాఁచి కాఁగిటఁ గూడి
       వొగ్గి లోనికిఁ దీసితే వొడఁబడేవు
       నిగ్గుల శ్రీవెంకటేశ నీవు న న్నప్పటిఁ గూడి
       తగ్గి యాపెచే మొక్కించి తగులు సేసేవూ