పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0365-2 లలిత సంపుటం: 11-386

పల్లవి: కానీవయ్య అందు కేమి కాల మిట్టే వుండీనా
         మాన కెవ్వతె సలిగె మతి నమ్మినాఁడవో

చ. 1: మాట లాడ నాతో నీకు మనసు రా దోమో కాక
       పాటించి నేఁ బిలువఁగా బరా కయ్యేవు
       చీటికి మాటికిఁ దొల్లి చేసన్నకె వచ్చేవాడఁ
       వీటున రాజసాన నీ వెవ్వరిఁ గైకొనవు

చ. 2: నగ నైనఁ గొంత నాతో నంటున దోసమో కాక
       మొగము నేఁ జాడఁగానె మోము వంచేవు
       అగపడి యేపొద్దు నాయండఁ బాయనివాఁడవు
       వెగటై మావిన్నపాలు వినఁ దీర దాయను

చ. 3: నిండినచలము నాపై నీకు నెంత గద్దో కాక
       బెం డైననన్నుఁ గాఁగిట బిగియించేవు
       కొండల శ్రీవెంకటేశ కూడి లో నైనవాఁడవు
       నిండుకొని యే డవుత నిన్ను నీ వెరఁగవు