పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0365-1 రామక్రియ సంపుటం: 11-385

పల్లవి: మొక మొక మెదుటనె ముంగోప మిఁక నేల
         పక పక నగుతానె పంత మిచ్చె నాతఁడు

చ. 1: ఆతడె నీ వున్నచోటి కంగనల నంపఁగాను
       యీతలఁ దల వంచేవు యేలమ్మ నీవు
       కాతరిం చంతటఁ బోక ఘనుఁడు దానె వచ్చె
       చేతులార నీవ నేవ నేయవమ్మ యిపుడు

చ. 2: కడు మోహములె నీకుఁ గప్ప మాతఁడు వెట్టఁగ
       యెడమాటలఁ దిట్టించే వే లమ్మ నీవు
       తడవి మీ రాతని తరుణులు దొబ్బిరట
       గొడవలు దీర వేఁడుకోవమ్మ పతిని

చ. 3: ఆయములు సోఁక నాతఁ డాన లెల్లఁ బెట్టుకోఁగా
       యీయేడ నవ్వులు నవ్వే వే మమ్మ నీవు
       వోయమ్మ శ్రీవెంకటేశుఁ డోఁగునూతులలోఁ గూడె
       నీయిచ్చ నాతఁ డున్నాఁడు నీవు మెచ్చ రాదా