పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-6 లలిత సంపుటం: 11-384

పల్లవి: చాలుఁ జాలు నే మన్నఁ జవి గావు
         కూళతన మింతే నిన్నుఁ గొసరఁ బోతేను

చ. 1: ఉమ్మగిలుఁ జిత్తముతో నుడుకుతా నుండేనన్ను
       యెమ్మెలకుఁ జెనకేవు యేరా నీవూ
       తమ్మి మొగ్గవాట్లకె తల్లడించే నామేను
       నిమ్మపంట వేసేవు నే నోపఁ గలనా

చ. 3: చెక్కు చేతఁ బెట్టుకొని చింతఁ బొరలెడినాతో
        యెక్కువఁ గేరడా లాడే వేరా నీవూ
        మొక్కలాన నీకు దక్కి మోసపోయి వున్న నన్ను
        తోక్కేవు నాకాలు వట్టి దూరప్పటి వలెనా

చ. 3: వులుకుట్టుఁజేఁతలకు నుస్సు రంటా నున్ననాతో
        యెలయించి నవ్వు నవ్వే వేరా నీవూ
        నెలవై శ్రీ వెంకటేశ నిన్నుఁ గూడి యలసితి
        బలిమిఁ గాఁగిట నిఁక పచ్చి సేయ వలెనా