పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-5 భవుళి సంపుటం: 11-383

పల్లవి: వెలఁది యీమాఁటె విన్నవించ నంపె
         వలవనిజోలి వద్దు సుమీ

చ. 1: తరుణిచూపుల దట్టపు వెన్నెల
       గరిమ నీపైఁ గాయఁగానె
       విరహపుఁగాక వేసవి యెండలఁ
       బోరలే వే మయ్య పొద్దు వోదా

చ. 2: పేఁడుచు మాటలఁ బెరతేనె నీపైఁ
       బోఁడి మాపె బూయఁగానె
       వేఁడి నిట్టూర్పుల వెసఁ గారముల
       మాఁడ నేల నీకు మంకు గద్దా

చ. 3: కొమ్మ నిన్నంతలోఁ గూడి మోవులనె
       చిమ్ముచు విందులు నేయఁగానె
       యిమ్ముల శ్రీవెంకటేశ ర తెంకలి
       కమ్మరఁ బెంచేవు కడ లేదా