పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-4 రామక్రియ సంపుటం: 11-382

పల్లవి: ఆతని నీవేమైనా నంటివా తొల్లి
         నీతమి తానె యెరుఁగు నీకేలే వెరవు

చ. 1: మొగము చూచె నతఁడు మొక్కిలి వందుకు నీ
       తగ వాతఁ డెఱఁగడా దాని కేమి
       పగ యిద్దరికి లేదు సంతాన నుండితి వింతే
       నిగిడి యిందుకుఁ గామ నీ కేలే వెరవ

చ. 2: తామెర వేసె నతఁడు తట్టితివి చేత నీవు
       దోమటి దోడికేవేళ దోసమా యేమి
       యేమిటాను మోసపోరు యిద్దరికి కిద్దరే సాటి
       నేమ మేమిటాఁ దప్పదు నీ కేలే వెరవ

చ. 3: చేత నిన్ను నంటఁగాను సిరసు వంచితి వింతే
        ఆతఁడె శ్రీవెంకటేశుఁ డందు కేమి
        యేతులకుఁ గూడితిరి యిద్దరు నిక్కడనే
        నీతితో బదుక వమ్మ నీ కేల వెరవ