పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-3 సాళంగనాట సంపుటం: 11-381

పల్లవి: ఇందాఁకా రా వన వేమమ్మా
         అందెందె నవ్వేవు అతనితో నమ్మా

చ. 1: యేలినరమణుని కెన్నఁడు నలుగవు
       తాలిమి నీకే తగు నమ్మా
       యీలాగులనే యిచ్చక మాడేవు
       మేలు మేలు నిను మెచ్చితి మమ్మా

చ. 2: దండ నున్నపతిఁ దరవులు వెట్టవు
       నిండురాజసము నీ దమ్మా
       వెండియు నతనికి వీడె మొసఁగితివి
       కొండఁ బోలు నీగుణ మమ్మా

చ. 3: శ్రీవెంకటపతిఁ జెక్కులు నొక్కేవు
       నీ వాడినవే నిజ మమ్మా
       కైవసంబుగా గాఁగిటఁ గూడితి
       దేవుల వతనికిఁ దెలిసితి మమ్మా