పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-1 పాడి సంపుటం: 11-379

పల్లవి: మాయలు మాని నాతో మాటలాడరా
         నాయడ మునిమచ్చుఁ దన మేల నీకు

చ. 1: ఆరయ నాకెవంతూ ననేవు నీ వప్పటిని
       నేరుపున నాపెమోము నేఁడు చూడవా
       కేరి కేరి నవ్వేవు కేఁగండ్లఁ జూచుకొంటా
       యేరా లే దటరా యీ మాట నీవు

చ. 2: బత్తి నాకు గల నంటాఁ బాయవు నీ వాపెకు
        హత్తిన చెలిచేఁ జెప్పి యంప వామాఁటా
        వత్తివలెఁ బైఁ బడేవు వట్టి చనవు సేసుక
        ఉత్తర మీరా యిందు కూరకుండేఁ గాని

చ. 3: యేపున నన్నే కాని యెవ్వరి నొల్లననేవు
        ఆపె సొమ్ములె కావా అట్టె నీమేన
        రాపుగా శ్రీవెంకటేశ రతి నన్నుఁ గూడితివి
        ఆపను లిన్నాళ్లదాఁకా నమరెఁ గా నీకు