పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0363-6 తెలుఁగుఁగాంబోది సంపుటం: 11-378

పల్లవి: చుట్టమవు గా వతని సూడుబంటవూఁ గావు
         ముట్టి వేఁడుకోఁ గాను మో మేల వంచేవే

చ. 1: గుట్టు లేక ఆతఁడు నీ కొంగు వట్టి తీసీని
       పట్టినచలము మాని పదవే నీకు
       వుట్టిపడి నీ చెక్కు లుంగరాలచేత నొక్కె
       బెట్టుగా నింతేసి యింకాఁ బెనఁగ నేమటికే

చ. 2: గక్కన నవ్వుతా వచ్చి కదిసి కూచున్నాఁడు
       వెక్కసపుకోప మింక విడవే నీవు
       అక్కరఁ దనపై నీకు ఆన లెల్లఁ బెట్టె నదే
       యిక్కడఁ దొల్లిటినేరా లెంచఁగ నేమిటికే

చ. 3: కందువ లంటుచు నిన్ను కాఁగిలించె నాతఁడు
       మందెమేళములు యింక మానవే నీవు
       అందెంది శ్రీవెంకటేశుఁ డన్నటాను నిన్నుఁ గూడె
       చంద మాయఁ బను లెల్ల సాదించ నేమిటికే