పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0363-5 రామక్రియ సంపుటం: 11-377

పల్లవి: ఇంకా నేల తడవేవు యేరా నీవు
         సంకె దేరె నాకు నీ చలమూఁ జెల్లెనూ

చ. 1: మాఁట నీతో నాడితిన మనసు దెలిసితిని
       యేఁటికి నన్నుఁ బిలిచే వేరా నీవు
       యీటుతోఁ బెండ్లాడితిని యిట్టె సేస వెట్టితివి
       వాఁట మాయ వలపులు వద్దనే నుందానను

చ. 2: చేత నీకు మొక్కితిని చేరి నీతో నవ్వితిని
       యీతల నన్నొరసేవు యేరా నీవు
       నీతగులు చూపితివి నెగు లెల్లాఁ బాపితిని
       యేతు నీకు గన మాయ యియ్వకొంటి వందుకూ

చ. 3: కన్నుల నిన్నుఁ జూచితి కాఁగిటిలో నున్నదాన
       యెన్నేసి ప్రియాలు చేప్పే వేరా నీవూ
       నన్ను మన్నించితి విట్టె నంటున శ్రీవెంకటేశ
       చిన్నిపులకలు నేఁడె సెలవు నా కాయను