పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0363-3 భైరవి సంపుటం: 11-375

పల్లవి: అట్టె కాదా తనమోహ మందరు నెరఁగ వద్దా
         మిట్టిపడి యిందు కే మెచ్చితిఁ గానేను

చ. 1: సవతులతో నేను సారె వాదు లడువఁగ
       తవిలి సాకిరి చెప్పీఁ దన కేలే
       యివల నేఁ దనుఁ జూచి యిందుకే వెల గంది
       కవకవ నవ్వితిని కడు సంగ తేయఁగా

చ. 2: పగ చాటి వారు నేను పంతములు నెరపితే
       తగవులు పచరించీఁ దన కేలే
       అగ డై యందుకే నేను అది యటు వెట్టి పతి
       మొగమె తప్పక చూచే మగిసెఁనా పనులు

చ. 3: వుఱక మాలో నేము వొట్లు వెట్టుకొంటేను
        తఱి సందిమాట లాడీఁ దన కేలే
        యెఱిఁగి శ్రీవెంకటేశుఁ డిందుకే నన్నుఁ గూడఁగ
        మఱచితి నన్నియును మన సొక్క టాయఁ గా