పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0363-2 దేసాక్షి సంపుటం: 11-374

పల్లవి: అప్పటప్పటికి బాగా లందియ్య వలె మనకు
         చెప్పరే కతలు యిఁకఁ జింత లేఁటికి

చ. 1: ముసిముసినవ్వులతో ముంగిట నుండినచెలిఁ
       గొసరి కొసరి పతి కొంగు వట్టెను
       వసమై యిద్దరు లోన వడిఁ బవ్వళించి రదే
       యెసఁగి వాకిట మన మిట్టే వుందమే

చ. 2: చిప్పిలుఁ జెమటతోడ సిగ్గువడి వున్నసతిఁ
       గప్పి పచ్చడ మాతఁడు గాఁగిలింనెచు
       దెప్పర మిద్దరు దోమతెరలోఁ గూచుండి రిదే
       కొప్పులు ముడుచుకొంటాఁ గూచందమే

చ. 3: మాట లాడె అలమేలుమంగఁ చెక్కు నొక్కి కూడె
       మేటి శ్రీవెంకటపతి మించురతుల
       మాటున నుండి వచ్చి మనవద్ద నిలిచిర
       చాటువ సురటులు విసరు చుందమే