పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0363-1 లలిత సంపుటం: 11-373

పల్లవి: ఎంత కెత్తుకొంటివి నీ వేరా వోరి
         చెంతల నవ్వు నవ్వేవు చెల్లురా వోరి

చ. 1: చెఱఁగు మాసినదాని చెక్కు ముట్టి వేఁడుకొని
       యెఱిఁగి నన్నంట వచ్చే వేరా వోరి
       యఱియు సురతపుఁజెమటలు జొబ్బిలఁగాను
       వుఱక నాపైఁ బూసేవు వుద్దండాలా వోరి

చ. 2: గుట్టున నాకెపొత్తున కోరి యారగించుకొంటా
       అట్టె నాకుఁ గడెఁ దిచ్చే వదేరా వోరి
       వొట్టుక ఆపెయు నీవు వుండనపరపుమీఁద
       యెట్టు గూచుండఁ బిలిచే వేరా నన్ను వోరీ

చ. 3: అచ్చు వాసుకొన్నదాని నట్టె నీవు గూడి వచ్చి
       యిచ్చల నన్నుఁ గూడితి వేరా వోరి
       పచ్చిగా శ్రీవెంకటేశ భ్రమసితి నీరతుల
       మెచ్చితి ని న్నిన్నిటాను మేలు మేలు వోరి