పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0362-5 దేవగాంధారి సంపుటం: 11-371

పల్లవి: మంచివాఁడ వవుదువు మమ్ముఁ దడవకు చాలు
         ముంచి నీకు నేపొద్దు మొక్కేము నేను

చ. 1: తెగనాడఁ జాలఁ గాక తేనెల నీమాటలకే
       ఆగపడి చిక్కరా దైత్యాంగనలు
       పగ కోప మింతే కాక పడఁతిఁ జంపినవాని
       మగతన మే మున్నది మరతునా నేను

చ. 2: యిచ్చకము మానఁ గాక యిట్టె నీ పొందుల సేసి
       కొచ్చి మరులు గొనరా గోపికలు
       వొచ్చె మిదె నీ కొడుకు వొగిఁ గూడపెట్టఁగాను
       తెచ్చుకొంటివి సతుల దేవరవు గావా

చ. 3: యింకా నే లని కాక యిట్టి నీకు మోహించి
       కొంకక వొక్కతె ముక్కుగోఁతఁ బడదా
       లంకె మమ్ము గూడితి వీలాగు మమ్ముఁ జేయకుమీ
       అంకెల శ్రీవెంకటేశ అన్నిటా నమ్మితిని