పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0362-2 భవుళి సంపుటం: 11-368

పల్లవి: సారె విన్నపము లేల చవులు వుట్టించ నేల
         దార దప్పకుండేజాణతన మింతే యిఁకనూ

చ. 1: నావలె వలచివట్టి నాతి నీకుఁ గలదా
       ఆవల నీవల నే నాడుకోఁ గాక
       నీవల్లఁ గడ మున్నదా నెరజాణతనమందు
       బావభేదములలోని భాగ్య మింతే కాక

చ. 2: యింత నీతో నవ్వెటియింతి నీ కొకతె యేది
       వింతగా నీపై వళకు వేయఁ గాక
       చెంత నీచేసినమేలు చెప్పితే నటువంటిదే
       కొంత గొంత కూడేవేళ గుణ మింతే యిఁకను

చ. 3: నిన్ను నేఁ గూడినరితి నేరుచునా యెవ్వ తైన
       పన్ని నిన్ను నే నిట్టే పంగించఁ గాక
      యిన్నిటా శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
      మున్నిటివెనకల యీ ముచ్చటలే యిఁకను