పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-5 మాళవి సంపుటం: 11-365

పల్లవి: నేరుపు గలితేఁ జాలు నీవే నేను
         దూరి మాటాడ నోప మందు లిట్టె నూరకురా

చ. 1: యెప్పడు నీ వారమే యేల పిలిచేవు మమ్ము
       చప్ప నై నీ నోరు నొచ్చీఁ జాలించ రాదా
       నెప్పున నే నీడ నుంటే నీ వద్ద నుండుట గాదా
       ముప్పిరిఁ బెనఁగ నోప ముంజుయి వట్టకురా

చ. 2: వూడిగపువార మింతే వొడ లేల నిమిరేవు
       తోడ నీచేతు లరిగీఁ దొలఁగ రాదా
       నీడల నే నవ్వితేనె నీ పరిణామము గాదా
       వీడ నాడ నే నోప వేసాలు సేయకురా

చ. 3: నీకు మేనదాన నింతే నీ వేల కిందు పడేవు
        కాకై నీ రాజసము కైకో రాదా
        యీకడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
        నీకు నే సరిగా నోప నీ వంత మెచ్చకురా