పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-4 ఆహిరి సంపుటం: 11-364

పల్లవి: నవ్వ నీకుఁ జెల్లు నట నాకుఁ గొసరఁ జెల్లదా
         రవ్వగాఁ దడవుదురా రాజసపు వాఁడవు

చ. 1: సిగ్గుపడి వున్నమమ్ముఁ జేయి వట్టి తియ్య నేల
       యెగ్గు వట్టె వేల నే నే మన్నాను
       అగ్గల మై సరసము లాడ నేర్చినవాఁడ
       వొగ్గి అన్ని మాటలనును వోరుచుకో నేరవా

చ. 2: జగడించి యున్నదాని చన్ను లంటి చూడ నేల
       తగవులఁ బెట్ట నేల తల మంటెను
       చిగులుతా మమ్ము నింత నేయ నేర్చినవాఁడవు
       యెగసక్కెపు మాకోపా లిముడుకోఁ జాలవా

చ. 3: కన్ను మూసుకున్నదాని కాఁగిలించి పట్ట నేల
       చిన్నఁ బోవ నేల నాచే దాఁకె నంటా
       యెన్నికెతో శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
       నిన్ను నన్ను నెంచుకొని నిండుకుండ నేరవా