పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-3 శంకరాభరణం సంపుటం: 11-363

పల్లవి: ఇంత నేరకుండితే నీ వేల వచ్చేవు
         వింత వింత వగ లెల్ల వింటిఁ గంటిరా

చ. 1: వాలుక రెప్పలు నే వంచిన మాత్రములోనె
       నాలికాఁడ నీ తనువు నాఁటె ననేవు
       యీలాగు మాట లాడి యిచ్చకాలు సేసుక
       కాల మెల్ల బతికితి కానీ కానీరా

చ. 2: చల్లఁగా నే గందవొడి చల్లిన మాత్రములోనె
       పల్లదాన తల దిమ్ము పట్టె ననేవు
       కల్ల గాదు యింత మాయకాఁడవు గాకుండితేను
       యెల్లవారిలోన నేఁడు యెట్టు వేగించేవురా

చ. 3: కొంకక నీ తొడమీఁద గూచున్న మాత్రములోనె
        అంకెల నీ కళ దాఁకె నని అనేవు
        సంకె లేక నీ వింతేసి జాణవు గాకుండితేను
        పొంకపు శ్రీవెంకటేశ పొంచి నన్నుఁ గూడేవా