పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-1 ముఖారి సంపుటం: 11-361

పల్లవి: తనవొళ్లి భయ మింతే తప్పులు నేఁ బట్టేనా
         వినవె సిగ్గు వడీని వేగిరించ నేఁటికే

చ. 1: అద్దము నేఁ జేడు మంటె నాన వెట్టి నవ్వీని
       అద్దలించి తన్ను వెంగె మాడేనా నేను
       వొద్దెకి నే రమ్మంటే నూరకే అట్టట్టు వొయ్యీ
       సుద్దు లింతే తన మేను సోదించ వచ్చేనా

చ. 2: జలక మాడే మంటేను సారె సారెఁ దల వంచీ
       యెలమిఁ దన కెగ్గవుత యెరఁగను
       అలరులు ముడిచే నంటేఁ దా లోఁగీని
       మలసి వాడుఁ జూపుల మచ్చము వట్టేనా

చ. 3: నిద్దరించు మంటేను నిట్టచూపు చూచీని
       యిద్దరి జాగరాలు నే యెత్తి పెట్టేనా
       కద్దులె శ్రీవెంకటాద్ర ఘనుఁ డిట్టె నన్నుఁ గూడె
       ముద్దమోము చూచి చూచి మొగ మోడ కుండేనా