పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-6 పాడి సంపుటం: 11-360

పల్లవి: ఎవ్వ రేమి చెప్పిరె యింతలోననే
         నివ్వటిల్ల వింత లెల్ల నేరుచుకొంటివా

చ. 1: మోము చూచి నవ్వఁగానె మోనానఁ దల వంచేవు
       యేమిటికే కోపము నీ కెన్నఁడు లేమి
       కామించి పిలిపించి కడసారె నలిగేవు
       నేమమున నివి గొన్ని నేరుచుకొంటివా

చ. 2: దగ్గరి నేఁ గూచుంటె తగ లేచి నిలిచేవు
       సిగ్గు గొంత జిగి గొంతఁ జిలికే వేమే
       అగ్గలపుఁ బ్రేమ చల్లి అంతలోఁ బిరి తీసేవు
       నిగ్గులు నీడలు కొన్ని నేరుచుకొంటివా

చ. 3: కాఁగిట నే నించఁగాను కన్నులు మూసుకొనేవు
       మాఁగఁ బెట్టేవు వలపు మతిలో మేలే
       పాఁగిన శ్రీవెంకటపతి నన్నుఁ గూడితవి
       నీఁగనిరతులు నేఁడు నేరుచుకొంటివా