పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-5 కొండమలహరి సంపుటం: 11-359

పల్లవి: ఇంతటా నీ మనసు రా దెగ్గు లెచం నేఁటి కోయి
         చింతతో నుందాన నంటా సిగ్గు వడే వోయీ

చ. 1: చిత్తమును నోవకుండా చిన్నఁబోయి వుండకుండా
       మెత్తనిమాట లాడితే మే లదే వోయి
       కొత్త లెల్లఁ దొఁచకుండా గుట్ట నీకుఁ జెడకుండా
       పొత్తుల నవ్వు నవ్వితి పూఁచి మెచ్చ వోయి

చ. 2: జగడాలు రాకుండా చనవునుఁ దప్పకుండా
       సగముచూపు చూచితి చాలదా వోయి
       తగులమిఁ బాయకుండా తప్పు నీపైఁ జేయకుండా
       మొగము వంచితి నే నీ ముందరనె వోయి

చ. 3: నింద నీపై మోయకుండా నేమమూనుఁ దప్పకుండా
        అంది నేఁ బరా కైతి నప్పుడే వోయి
       కందువ శ్రీవెంకటేశ కాఁగిలించితివి నన్ను
       చంద మాయ నిద్దరికి సరి లేదు వోయి